
సుందరయ్య కాలనీ పార్టీ శాఖ కార్యదర్శి కామిశెట్టి ఆంజినేయులు,భవన నిర్మాణ కార్మికుడు ఎ సతీష్‌ల పై హత్యాయత్నం చేసిన రౌడి మేకలపై కఠిన చర్యలు తీసుకోవాలని, సుందరయ్య కాలనీ పేదలకు రక్షణ కల్పించాలని సిపియం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు వి.ఉమామహేశ్వరరావు అన్నారు. హాస్పిటల్ చికిత్స పొందుతున్న ఆంజినేయులు, సతీష్‌లను పరామర్శించారు. రౌడిలపై ముందుగా పొలీసులకు సమాచారం ఇచ్చిన స్థానిక సిఐ స్పందించక పోగా దెబ్బలు తగిలన తరువాత రాండి అనటం, కాలనీకి వెళ్ళి సిపియం నాయకులను ఆఫీసు నుండి వెళ్ళి పోమ్మని చెప్పటం చూస్తే రౌడి మూకలకు అండగా నిలబడినట్లు ఆర్ధమవుతున్నదని సిఐ తిరుపై మండిపడ్డారు. తక్షణమే సిఐ మీద కూడ చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు.