
రాయలసీమ కరువు నివారణచర్యలు తీసుకోవాలని కోరుతూ వామపక్షాల ఆద్వర్యంలో కడపలో శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న సిపిఎం, సిపిఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టులు చేశారు.రాయలసీమలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వంలో చలనం లేదని , బంద్ నిర్వహిస్తామనగానే జూన్ రెండు నుంచి ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. హామీల అమలు మాటలలో కాకుండా చేతల్లో చూపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాల్సిన అవసరముందని, కరువు సహాయక చర్యలు తక్షణం చేపట్టాలని , అదే విధంగా ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీనివ్వాలని మధు డిమాండ్ చేశారు.