
విశాఖపట్నం, వాల్తేరు డివిజన్‌ను ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా నాయకులు కె లోకనాధం, డాక్టర్ బి గంగారావు ఆర్‌కెఎస్‌వి కుమార్ ఈస్ట్‌కోస్టు రైల్వే జనరల్ మేనేజరు రాజీవ్ విష్ణోరుకు వినతిపత్రం అందజేశారు. శుక్రవార స్థానిక డిఆర్‌ఎం కార్యాలయంలో జిఎమ్‌ను కలిసి, వినతిపత్రం అందజేసిన తర్వాత వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టం, 2014లో పేర్కొన్న విశాఖపట్నం ప్రత్యేకరైల్వేజోన్ అంశాన్ని జిఎం దృష్టికి తీసుకెల్లామన్నారు. ఏడాదికి సుమారు రూ. 7 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్న వాల్తేరు డివిజన్‌ను ప్రత్యేక జోన్‌గా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పోర్టు స్టీల్‌ప్లాంట్, సెజ్‌లు, ఫార్మా ఇండిస్టీలు, విద్యాసంస్థలు ఆసుపత్రులతో విశాఖ నగరం అభివృద్ధి చెందిందన్నారు. ఒడిశా, చత్తీచ్‌గడ్ రాష్ట్రాల ప్రజలు కూడా వాల్తేరు డివిజన్ పరిధిలో ఉన్నారన్నారు. దీనిపై దృష్టి సారించాలని వారు కోరారు. మోడల్ స్టేషన్‌గా ప్రకటించినప్పటికీ ఇక్కడ అసౌకర్యాలు తిష్టవేశాయని కోరగా, దీనిపై దృష్టి సారిస్తామని జిఎమ్ హామీ ఇచ్చారని తెలిపారు.