
విద్య, భావజాల రంగాల్లో హిందూత్వ శక్తులు పేట్రేగిపోతున్నాయి.తాజాగా బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి చెందిన ఐఐటీ ప్రముఖ సామాజిక కార్యకర్త, మెగసెసే అవార్డు గ్రహీత సందీప్ పాండేను బోధనా బాధ్యతల నుంచి తొలగించింది. సందీప్ ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థలోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీగా ఉన్నారు. ఆయన 'అవాంఛనీయ కార్యకలాపాలకు' పాల్పడుతున్నారని అధికారులు ఆరోపించారు. కాగా, తనను వెళ్లగొట్టడం వెనుక ఆర్‌ఎస్‌ఎస్ హస్తముందని సందీప్ పాండే ఆరోపించారు.