సిపిఎంపై ఆరెస్సెస్‌ తప్పుడు ప్రచారం

కేరళ ఉత్తర ప్రాంతంలో హింసారాజకీయాలకు పాల్పడుతున్న ఆరెస్సెస్‌ తమ కార్యకర్తలను సిపిఎం హత్య చేస్తోందంటూ తప్పుడు ప్రచారం చేయటం విడ్డూరంగా వుందని సిపిఎం పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ కార్యకర్తలపై సిపిఎం దాడులు చేస్తోందంటూ తెలంగాణాలోని హైదరాబాద్‌లో ఆరెస్సెస్‌ అఖిల భారత కార్యకారి మండల్‌ సమావేశంలో ఆమోదించిన తీర్మానాన్ని పొలిట్‌బ్యూరో తప్పుపట్టింది. వాస్తవ పరిస్థితులకు, తీర్మానానికి భారీ వ్యత్యాసం వుందని తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల ముగిసిన తరువాత ఫలితాలు ప్రకటించే రోజు ఆరెస్సెస్‌ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కొనసాగుతున్న విజయోత్సవ ప్రదర్శనపై ఆరెస్సెస్‌ బాంబు లతో చేసిన దాడిలో సిపిఎం కార్యకర్త ఒకరు మరణించారని, అనేక మంది గాయపడ్డారని గుర్తు చేసింది.