
'కాంగ్రెస్ దర్శన్' ఇది కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార పత్రిక, హిందీలో ప్రచురితమయ్యే ఈ పత్రికలో వచ్చిన వ్యాసాలు ఇపుడు పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఏకంగా భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని టార్గెట్ చేస్తూ రాసిన ఆర్టికల్స్ పార్టీలో కలకలం రేపింది. సోనియా గాంధీ ముఖచిత్రంతో వెలువడ్డ కాంగ్రెస్ దర్శన్ డిసెంబర్ సంచికలోని ఓ వ్యాసంలో ఆమె జీవితాన్ని ప్రస్తావించారు. సోనియా తండ్రి ఇటలీ ముస్సోలిని సేనానిగా పనిచేశారని, అతనో ఫాసిస్టని పేర్కొంది..