
విశాఖ మున్సిపల్ కార్మికుల సమ్మెతో స్మార్ట్ విశాఖ కాస్తా చెత్త విశాఖగా మారిపోయింది. గత ఆరు రోజులుగా మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతున్న తరుణంలో నగరమంతా కంపుమయం అయ్యింది. 72 వార్డుల్లో దుర్గంధమయం అయ్యాయి. రోజుకు 800 టన్నుల చెత్త విశాఖలో పేరుకుపోయింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో జనం పరిస్థితి దయనీయంగా మారింది. దానికి తోడు వర్షం పడతే రోడ్డులు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. దాని వలన అంటువ్యాధులు ప్రభలే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.