
కేంద్ర ప్రభుత్వం విడుదలజేసిన స్మార్ట్ సీటీల నామినేషన్ జాబితాలో విజయవాడకు చోటు లభించింది. వివిధ రాష్ట్రాల రాజధానులు లక్నో, ముంబయి, గాంధీనగర్, జైపూర్, భువనేశ్వర్, రారుపూర్, గౌహతిలతోబాటు విజయవాడ కూడా ఆ జాబితాలో చోటు సంపాదించుకోవడం విశేషం. 100 స్మార్ట్ సిటీలకు నామినేట్ అయిన వాటిలో పాట్నా, కోల్‌కతా, బెంగుళూరులకు చోటు దక్కలేదు. ఢిల్లీతో సహా అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలూ ఇందులో చేరాయి. తక్కువ ప్రాముఖ్యం కలిగిన నగరాలు, మునిసిపాలిటీలను -బీహార్‌లోని బీహార్ షరీఫ్, ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్, సహరాన్‌పూర్‌లు, హిమాచల్‌లోని ధరమ్‌శాల, కర్ణాటకలోని శివమొగ్గలను- రాష్ట్రాలు నామినేట్ చేశాయి. ఎంపిక ప్రమాణాల ప్రకారం పెద్ద పెద్ద నగరాలకు ఈ జాబితాలో చోటు కల్పించలేదని పట్టణాభివృద్ధి శాఖ వర్గాలు తెలిపాయి. జెఎన్‌యుఆర్‌ఎమ్ పథకాలు పేరుతో ప్రవేశపెట్టిన పట్టణ సంస్కరణల అమలు ఈ స్మార్ట్ సిటీల ఎంపికలో ఒక ప్రధాన కొలబద్దగా కేంద్రం పెట్టింది. ఆ ప్రమాణాల ప్రకారం విజయవాడకు చోటు దక్కలేదని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పేర్కొంది. కానీ, కేంద్రం విడుదలజేసిన నామినేషన్ జాబితాలో విజయవాడ చోటు పంసాదించుకుంది. మొదటి దశగా కేంద్ర 20 నగరాలను ఎంపిక చేసింది. వచ్చే రెండేళ్లలో 40 నగరాలను ఎంపిక చేస్తారు. ఈ నగరాలు ఐదేళ్ల కాలానికి రూ. 500 కోట్ల కేంద్ర సహాయాన్ని పొందుతాయి. కనుక, స్మార్ట్ సిటీలుగా నామినేట్ చేసిన అన్ని మునిసిపాలిటీలు, నగరాలు అభివృద్ధి చెందుతాయి. మరిన్ని నగరాలను ఈ పథకం కింద ఎంపిక చేయడానికి పట్టణాభివృద్ధి శాఖ సుమఖుంగా ఉందని తెలియవచ్చింది. దాంతో మరిన్ని నగరాలు అభివృద్ధి బాట పడతాయి. అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. రాష్ట్రాలు ఎంపిక చేసిన అన్ని నగరాలనూ కేంద్రం ఆమోదిస్తుందని, రాష్ట్రాల సహకారం ఉరటేనే ఈ పథకం విజయం సాధిస్తుందని మంత్విత్వ శాఖ అధికారులు తెలిపారు.