స్మార్ట్‌ నగరాలు ఎలా?: కేజ్రీ

నగరాల్లో పేదలను పేదలుగానే వుంచి స్మార్ట్‌ సిటీలను సాధించలేమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. నగరాల్లోని ప్రజలు పేదరికం, నిరుద్యోగం, కనీస సౌకర్యాలైన మంచి నీటికొరత లాంటి ఇబ్బందులతో సతమతమవుతుంటే అవి ఎలా స్మార్ట్‌ నగరాలుగా మారతాయని ఆయన ప్రశ్నించారు. మొదట ప్రజల జీవితాలను స్మార్ట్‌ చేయండి ఆ తరువాత స్మార్ట్‌ సిటీల గురించి మాట్లాడొచ్చు అని ఆయన కేంద్ర ప్రభుత్వంపై వ్యంగ్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. కేవలం మంచి రోడ్లు ఉన్నంత మాత్రాన ఏ నగరమూ స్మార్ట్‌ సిటీగా మారిపోదని, అక్కడ జీవించే సామాన్య ప్రజలు కూడా స్మార్ట్‌ ఫలాల్ని పొందగలిగినపుడే ఏ నగరమైనా స్మార్ట్‌గా మారుతుందన్నారు.