హిందూసేన ఇంకు దాడి..

 జమ్మూ కాశ్మీర్‌ ఇండిపెండెంట్‌ ఎంఎల్‌ఎ ఇంజనీర్‌ రషీద్‌పై ఢిల్లీ ప్రెస్‌ క్లబ్‌లో దాడి జరిగింది. ప్రెస్‌ క్లబ్‌ ఆవరణలో ముగ్గురు వ్యక్తులు ఆయనపై సోమవారం మధ్యాహ్నం ఇంకు, ఆయిల్‌తో దాడి చేశారు. కొద్ది మాసాల క్రితం ఆయన బీఫ్‌ పార్టీకి ఆతిధ్యమిచ్చినందుకు నిరసనగా ఈ చర్యకు పాల్పడ్డారు. తొలుత ఢిల్లీ ప్రెస్‌ క్లబ్‌లో రషీద్‌ మాట్లాడుతూ, ''నా ఆవుతో ఏం చేస్తానన్నది నా ఇష్టం. నా ఆవుతో ఇతరులకు ఏం పని?'' అని ప్రశ్నించారు. రషీద్‌, మీడియాను ఉద్దేశించి ప్రసంగించిన కొద్ది నిముషాలకే ఈ దాడి జరిగింది. కాగా ఈ దాడికి కారకులైన ఇద్దరిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ దాడికి విష్ణు గుప్తా నేతృత్వంలో హిందూ సేన బాధ్యత వహించినట్లు వార్తా సంస్థలు తెలిపాయి.