
స్వచ్ఛ హైదరాబాద్-స్వచ్ఛ రాజకీయాలు 'క్లీన్ హైదరాబాద్-క్లీన్ పాలిటిక్స్' అనే నినాదంతో జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, ఎంసీపీఐ(యు), లోక్‌సత్తా, ఎంబీసీ జాక్, కాలనీ సొసైటీలు ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డీజీ నర్సింగరావు తెలిపారు. జీహెచ్‌ఎమ్‌సీ పరిధిలో 150 డివిజన్లు ఉండగా, ఇప్పటికే 60 స్థానాల్లో ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలనే అంశంపై చర్చించి, నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ 60 డివిజన్లలో లోక్‌సత్తా 21, సీపీఎం 26, సీపీఐ 12, ఎంసీపీఐ (యు) ఒక స్థానంలో పోటీ చేసేందుకు నిర్ణయించామని తెలిపారు.