
జీఎస్టీ బిల్లు ఆమోదానికి సానుకూల నిర్ణయం తీసుకుంటే బడ్జెట్ సమావేశాలను ముందే ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెంకయ్య నాయుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో అన్నారు. గురువారం ఢిల్లీలో సోనియా గాంధీని వెంకయ్యనాయుడు కలిశారు. జీఎస్టీ బిల్లుపై కాంగ్రెస్ లేవనెత్తిన మూడు అంశాలపై ఇప్పటికే ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ సవివరంగా సమాధానం చెప్పారని, కాబట్టి బిల్లు ఆమోదానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.