RBI గవర్నర్‌గా రాకేశ్‌ మోహన్‌?

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తదుపరి గవర్నరుగా ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ రాకేశ్‌ మోహన్‌ నియమితులయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వాషింగ్టన్‌లోని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐంఎంఎఫ్‌)లో మన దేశం తరఫున ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా మోహన్‌ ఉన్నారు.