
ఉత్తరప్రదేశ్‌లోని దళితులపై దాడి చేసిన దన్కౌర పోలీస్టేషన్ అధికారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిఎస్‌ఎంఎం జాతీయ నేత వి.శ్రీని వాసరావు డిమాండు చేశారు. దళిత కుంటుంబంపై జరిగిన దాడిన నిరసిస్తూ బుధవారం దళిత శోషణ్ ముక్తి మంచ్ (డిఎస్‌ఎంఎం) ఢిల్లీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యం లో కార్యకర్తలు ఢిల్లీలోని యూపి భవన్‌ను ముట్టడికి యత్నిస్తే ఢిల్లీ పోలీసులు అనుమతి లేదని మధ్యలోనే అడ్డుకున్నారు. కేంద్ర, యూపి ప్రభుత్వాలకు వ్యతిరే కంగా పెద్దపెట్టున నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమాన్నుద్దేశించి శ్రీనివా సరావు మాట్లాడుతూ ఇటీవలి కాలం దేశంలో దళితులపై దాడులు పెరిగాయని, వీటిని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని ధ్వజమెత్తారు. న్యాయం చేయాలని పోలీస్టే షన్‌కు వెళ్ళిన దళిత కుటుంబంపై దాడి చేసి వివస్త్రలను చేసే ఘటనను చూసి దేశం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. యూపి పోలీసులు న్యాయం చేయకపోగా దాడి చేయడం అమానుషమన్నారు. తిరిగి దళితులపై కేసు నమోదు చేసి, జైల్లో పెట్టడం అప్రజాస్వామికమన్నారు. అలాగే ఈ ఘటనను సామాజిక మాధ్యమాల్లో చూపించిన వ్యక్తిపై కేసు నమోదు చేయడం దారుణ మన్నారు