
విఆర్‌ఎల దీక్షలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, వారి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎపిపిఎస్‌సి ద్వారా నియమితులైన 5,600 మంది విఆర్‌ఎలకు తగిన పారితోషికం చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం బాధాకరమన్నారు. రెవెన్యూ శాఖలో శాశ్వత ఉద్యోగులకు చెల్లిస్తున్న జీతభత్యాలను విఆర్‌ఎలకూ చెల్లించాలని కోరారు.