August

కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జైల్ భరో

మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ విమర్శించారు. కేంద్ర కార్మిక, రైతాంగ సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు కర్నూల్లో జైల్‌భరో కార్యక్రమంలో భాగంగా కార్మిక కర్షకులు కలెక్టరేట్‌ను ముట్టడించారు.ఈ సందర్భంగా పోలీసులు కార్మిక, రైతాంగ సంఘాల నాయకులను అరెస్టు చేసి మూడవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ మాట్లాడుతూ మోడీ అధికారంలోకి రాకముందు పండించిన పంటలకు 50 శాతం అదనంగా మద్దతు ధర కల్పిస్తామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదని అన్నారు.

భోగాపురం ఎయిర్ పోర్టు పనులను జి.ఎం.ఆర్ కు కేటాయించడంపై ఆందోళన

భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ పనులను దక్కించుకున్న ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) కి కాకుండా ప్రైవేట్ సంస్థ అయిన జి.ఎం.ఆర్ కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. విశాఖ నగరంలో వున్న తాజ్ హోటల్ (గేట్ వే) లో భోగాపురం ఇంటర్నేషనల్ ఫ్రీ అప్లికేషన్ కాన్పెరెన్స్ ను రద్దు చేయాలని, నిర్మాణ పనులు ఎఎఐ కి అప్పగించాలని ఆందోళన చేస్తున్న సిపిఎం కార్యకర్తలను, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింగరావును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. 

ప్రజాసంఘాల నాయకులు,పార్టీ నాయకులపై పెట్టిన రౌడీ షీట్లపై విచారణ జరిపి ఎత్తివేయాలని కోరుతూ

Pages

Subscribe to RSS - August