భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 01 నవంబరు, 2025.
కాశీబుగ్గ ఘటనపై సిపిఐ(యం) దిగ్భ్రాంతి
శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాటలో 10 మంది మృతిచెందడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల్లో మహిళలు, చిన్నపిల్లలు ఉండడం విచారకరం. వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నది. ఈ ఘటనలో అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారి కుటుంబాలకు, గాయపడిన భక్తులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నది.