నిషేధం, దుందుడుకు ధోరణులు, ఆజ్ఞలు, మూసివేతలు లాంటివి సహనస్ఫూర్తినీ లేదా మన రాజ్యాంగాన్ని ప్రతిధ్వనిం చవు. అసహన రాజకీయాలకూ, సహన సిద్ధాంతాన్ని ప్రవచించే జైన మత ఆచారాలకు ముడిపెట్టడం హాస్యాస్పదం. దీనికి సంబంధించి పత్రికల్లో వచ్చే చిన్నచిన్న వార్తలన్నింటినీ పాఠకులు కలిపి చూడాలి. జైనులు ఆచరించే పర్యూషన్ (ఉపవాసదీక్ష వేడుక) సందర్భంగా మాంసం విక్రయంపై విధించిన నిషేధానికి సంబంధించి పత్రికలలో వచ్చిన కథనాల తీరు నన్ను బాగా ఆందోళనకు గురిచేసింది. బిజెపి కార్యక లాపాలు ఎవరినీ నొప్పించని విధంగా సున్నితం గా ఉన్నాయని వ్యాఖ్యాతలు విశ్లేషించారు.