
ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా బెంగలూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని గిరీష్ ఓ సభలో డిమాండ్ చేశారు. దీంతో కర్నాటక రచయిత కల్బుర్గి, మహారాష్ట్రలో పన్సారేకు పట్టిన గతే పడుతుందని ట్విట్టర్లో గిరీష్ కర్నాడ్‌ను కొందరు హెచ్చరించారు.