
దేశంలో గాడ్సేను పొగిడిన ప్రధాని మోడీ..లండన్ పార్లమెంట్ ఆవరణలో గాంధీని పొగడటం బీజేపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి విమర్శించారు. దేశంలో మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్న మోడీకి బీహార్ ఎన్నికలు చావుదెబ్బవంటివని అన్నారు. మోడీ చేస్తున్న విదేశి పర్యటనలన్నీ మన దేశంలోకి విదేశీ పెట్టుబడుదారులకు రెడ్ కార్పెట్ వేసేందుకేనని చెప్పారు.