
ప్రధానమంత్రి నరేంద్రమోడీ సారధ్యంలో 'క్లోజింగ్ ఇండియా' అవుతోందని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, స్కిల్డ్ ఇండియా, డిజిటల్ ఇండియా అంటూ ప్రజలను భ్రమల్లో ముంచివేస్తున్నారని ఆరోపించారు. కార్పోరేట్లు, పెట్టబడిదారులకు దాసోహమంటూ.. హిందుస్థాన్ మెసిన్ టూల్స్ (హెచ్ఎంటీ) వంటి సంస్థలను మూసివేస్తే.. 'మేక్ ఇన్ ఇండియా' ఎలా సాధ్యమని ప్రశ్నించారు.