
హెచ్‌సీయూలో పీహెచ్డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై దేశ రాజధాని అట్టుడుకుతోంది. విద్యార్థి సంఘాలు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈరోజు జంతర్‌మంతర్ వద్ద పలు విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టారు. రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆందోళన చేపట్టిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.