
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎన్నికల సంఘం(ఈసీ) అనుమతించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో అమలులో ఉన్న ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలని సూచించింది. ప్రతినెల నిర్వహించే ఈ కార్యక్రమానికి అనుమతి కోరుతూ కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా కార్యక్రమ నిర్వహణకు ఈసీ బుధవారం అనుమతి ఇచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.