
కాపు భవనాలకు కూడా చంద్రన్న పేరు పెట్టాలన్న నిర్ణయం కలకలం రేపింది. చంద్రన్న కాపుభవనాలు అంటూ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనపై కాపు నేతలు భగ్గుమన్నారు. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే తీవ్రస్థాయిలో ఆందోళన తప్పదని హెచ్చరించారు. దీంతో సర్కారులో కదలిక మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం నాడు తన నివాసంలో అధికారులతో దీనిపై ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం.