షెడ్యూల్ తరగతుల ఉప ప్రణాళిక (ఎస్సిఎస్పి) అమలు, పర్యవేక్షణ, సమీక్ష బాధ్యతలను నీతి అయోగ్ నుండి తమకు బదిలీ చేయడం సరికాదని సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తమకు సిబ్బంది కొరతే ఇందుకు కారణమని తెలిపింది. 12వ పంచవర్ష ప్రణాళికకు ఇంకా ఏడాది మాత్రమే గడువున్న నేపథ్యంలో ఇప్పటివరకు కూడా ఆ తర్వాత ప్రణాళికా వ్యవస్థ వుంటుందా లేదా అనే విషయమై తుది నిర్ణయం తీసుకోలేదని సామాజిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.