గుల్బర్గా దోషులకు శిక్షలు ఖరారు

గుల్బర్గా సొసైటీ ఊచకోత కేసులో దోషులకు ప్రత్యేక కోర్టు గురువారం శిక్షలు ఖరారు చేయనున్నది. ఈ కేసులో 24 మందిని కోర్టు దోషులుగా విడిచిపెట్టింది. గుజరాత్‌లో 2002లో జరిగిన ఘర్షణల సమయంలో కాంగ్రెస్‌ మాజీ ఎంపీ ఇషాన్‌ జాఫ్రీతో సహా 69 మంది ఊచకోతకు గురయ్యారు. ఈ కేసులో దోషులకు మరణ శిక్షకు తక్కువ కాని శిక్ష గాని, జీవిత ఖైదును గాని విధించాలని ప్రాసిక్యూషన్‌ కోర్టును కోరింది.