పన్సారే కేసులో స్టే పొడిగింపు..

హేతువాది గోవింద్‌ పన్సారే హత్య కేసులో అరెస్టు అయిన హిందూ గ్రూపు కార్యకర్త సమీర్‌ గైక్వాడ్‌పై అభియోగాల నమోదుపై విధించిన స్టేను బొంబాయి హైకోర్టు పొడిగించింది. బ్రిటన్‌ నుంచి ఫోరెన్సిక్‌ నివేదిక కోసం ప్రాసిక్యూషన్‌ వేచిచూస్తుండటంతో కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.