
నవ్యాంధ్ర రాజధాని చెంతనే ఉన్న ఆంధ్రుల వాణిజ్య రాజధాని విజయవాడలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి న మెట్రో రైల్ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సాక్షాత్తు రాష్ట్రానికి చెందిన ఓ కేంద్ర మంత్రే ’విజయవాడ మెట్రో రైల్ ప్రాజెకు’్టకు మోకాలడ్డుతున్నట్లు సమాచారం. రోజురోజుకూ విస్తరిస్తున్న విజయవాడ నగరంలో ట్రాఫిక్ కష్టాలను అధిగమించేందుకు గన్నవరం విమానాశ్రయం నుంచి రాజధాని నగరం అమరావతి వరకు మెట్రో రైలు మా ర్గాన్ని నిర్మించాలని ఏపీ సర్కార్ భావించింది. దానికి సంబంధించిన సవిరమైన నివేదికను రూపొందించే బాధ్యతను మెట్రో మ్యాన్ శ్రీధరన్ నేతృత్వంలోని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ)కి గతేడాది అప్పగించింది. డీఎంఆర్సీ కొద్ది నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి ‘తుది సవివర ప్రాజెక్టు నివేదిక’ (ఫైనల్ డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సమర్పిం చింది. ప్రాథమిక అంచనాలతో పోలిస్తే తుది అంచనాలు వందల కోట్ల రూపాయల మేర పెరగడం సాధారణమైన ప్రస్తుత తరుణంలో డీఎంఆర్సీ రూపొందించిన తుది నివేదికలో మాత్రం ప్రాథమిక అంచనా వ్యయం(రూ.7500 కోట్లు) కన్నా దాదాపు రూ.2232 కోట్లు తక్కువగా రూ.5268 కోట్లను అంచనా వ్యయంగా పేర్కొనడం గమనార్హం. దీంతో డీఎంఆర్సీకి విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు అప్పగించడం లాంఛనప్రాయమని, త్వరలోనే పనులు కూడా ప్రారంభమవుతాయ ని పలువురు భావించారు. అయితే అనూహ్యంగా మెట్రో పనుల ప్రారంభంలో విపరీతమైన జాప్యం చోటుచేసుకుంటోంది.