
పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డైరెక్ట్ అటాక్ చేశారు. ధరల పెరుగుదలపై నిలదీశారు. గతంలో హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచార సభలో మోదీ తాము అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి ఆచరణలో విఫలమయ్యారని ఆరోపించారు. ధరలు తగ్గించే తేదీని ప్రకటించాలని రాహుల్ కోరారు. ధరలను ఎప్పుడు నియంత్రించగలరో, ద్రవ్యోల్బణాన్ని ఎప్పుడు తగ్గిస్తారో తెలపాలని డిమాండ్ చేశారు.