
కృష్ణా-గోదావరి బేసిన్‌లోని డీ6 క్షేత్రాల నుంచి లక్ష్యానికి తగినంతగా సహజ వాయువును ఉత్పత్తి చేయనందుకు ప్రభుత్వం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రూ. 2,500 కోట్ల అదనపు జరిమానా విధించింది. 2010 ఏప్రిల్ 1 నుంచి మొదలై వరుసగా ఐదేండ్లుగా ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోనందుకు రిలయెన్స్, దాని భాగస్వామ్య కంపెనీలు తమకైన ఖర్చుల్ని రికవరీ చేయడానికి వీల్లేకుండా చేయడం రూపంలో విధించిన జరిమానాను కూడా కలుపుకుంటే అది రూ. 18,459 కోట్లవుతుంది.