
భూ సేకరణ చట్ట సవరణ బిల్లు, రైతు ఆత్మహత్యలపై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేస్తూ మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ ఢిల్లీలో నిరాహార దీక్షకు దిగారు. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ధర్నాలో జెడిఎస్ ఎమ్మెల్యేలు, ఎంపిలతో పాటు సమాజ్‌వాదీ పార్టీ నాయకులు అతనికి మద్దతు నందించారు.. పార్లమెంటులో రైతు ఆత్మహత్యలపై సంపూర్ణమైన చర్చ జరిగేంతవరకు తమ దీక్ష కొనసాగుతుందని పార్టీవర్గాల సమాచారం. రైతు ఆత్మహత్యలపై కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయని, సున్నితమైన అంశంపై అతను చేసిన అనుచిత వ్యాఖ్యలు రైతులను కించపరిచేలా ఉన్నాయని దేవెగౌడ వ్యాఖ్యానించారు. ఓ వ్యవసాయ మంత్రి రైతుల గురించి ఇలాంటి దిక్కుమాలిన వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి. ఇంతటి దారుణ వ్యాఖ్యలు తర్వాత కూడా ప్రధాని అతన్ని మంత్రివర్గంలో ఎలా కొనసాగిస్తు న్నారని ఆయన ప్రశ్నించారు. దేశంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిరోజు కర్ణాట కలో దాదాపు 16 మంది రైతులు బలవన్మ రణాలకు పాల్పడుతున్నారని, సోమవారం కూడా 9 మంది మరణించారని గౌడ చెప్పా రు. ఈ నిరసన దీక్షకు సిపిఎం ప్రధాన కార్య దర్శి సీతారం ఏచూరి, ఎస్పి నాయకుడు ములాయం సింగ్‌యాదవ్, జెడియూ అధ్యక్షుడు శరద్‌యాదవ్, సిపిఐ నాయకులు డి రాజా తమ మద్దతు తెలిపారు.