
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ,
విజయవాడ,
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
తేది : 26 ఫిబ్రవరి, 2024.
తిరుపతిలో జగనన్న ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం ఆందోళన చేస్తున్న పట్టదారులను అరెస్టు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, పట్టాదారులకు తుడా క్వార్టర్స్ పరిధిలోనే ఇళ్ళ స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నది.
ఇళ్ళు లేని పేదలకు శెట్టిపల్లి పంచాయితీలో 2,736 మందికి తుడా క్వార్టర్లు పరిధిలో 41.109 ఎకరాల్లో ఇళ్ళ స్థలాలు కేటాయించారు. దాన్ని అర్ధాంతరంగా, అకారణంగా మార్పు చేసి సుదూర ప్రాంతమైన ఏర్పేడు వద్ద చిందేపల్లిలో కేటాయిస్తున్నామని చెప్పటం అన్యాయం. లబ్దిదారులు అసలు తమకు స్థలం వస్తుందో లేదోనని ఆందోళన చెందుతూ గత 3సం॥లుగా పోరాటం చేస్తున్నారు.
ఈ రోజు అరెస్టు అయిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి వి.నాగరాజు, జిల్లా కమిటీ సభ్యులు ఎం.మాధవకృష్ణ, వ్రామిక మహిళా కన్వీనర్ ఆర్.లక్ష్మీ, నగర కమిటీ నాయకులు పి.బుజ్జి, బి.రవి, బి.వెంకటేష్‌లతో పాటు 30 మంది లబ్దిదారులు ఉన్నారు.
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇళ్లు కట్టిస్తానని ప్రగల్భాలు పలుకుతున్న వైసిపి ప్రభుత్వం ముందు కేటాయించిన స్థలాన్ని మార్పు చేయడం అన్యాయం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తుడా క్వార్టరు పరిధిలోనే లబ్ధిదారులకు స్థలాలు కేటాయించాలని కోరుతున్నాను.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి