
ప్రచురణార్ధం/ప్రసారార్ధం : విజయవాడ,
తేది : 01 మార్చి, 2024.
ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం నేడు విద్యార్ధి, యువజన సంఘాలు చేపట్టిన ఛలో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ అణచివేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఖండిరచారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే అనేక పరిశ్రమలు వచ్చి నిరుద్యోగ యువతతకు ఉపాధి అవకాశాలు దక్కేవి. చదువు పూర్తయిన వారు వేరే రాష్ట్రాలకు ఉపాధి కోసం వెల్లవలసిన అవసరం ఉండేది కాదు. నేపధ్యంలో విద్యార్ధి, యువజన సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు చలో సీఎం క్యాంప్ ఆఫీస్‌కు పిలుపునిచ్చారన్నారు.
అరెస్టయి మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు చలసాని శ్రీనివాస్, జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ, విద్యార్ధి, యువజన సంఘాల నాయకులను సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు వెళ్ళి పరామర్శించారు.
ఆందోళనకు మద్దతు తెలిపిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణను గృహనిర్భందం చేయడం అప్రజాస్వామికం అని అన్నారు.
(జె.జయరామ్)
ఆఫీసు కార్యదర్శి