
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 02 మార్చి, 2024.
నిర్వాసితులను వెలుగొండలో ముంచుతారా?
సిపియం ప్రశ్న
అసంపూర్ణ ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఎన్నికల స్టంటు
ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు క్రింద 11 గ్రామాల్లో ఉన్న 8 వేల కుటుంబాలకు పునరావాసం ఇవ్వకుండానే ప్రాజెక్టును జాతికి అంకితం చేయబోతున్నట్లు ప్రకటించడం హాస్యాస్పదం. ఫీడర్ కెనాల్ పూర్తికాలేదు, వదలడానికి శ్రీశైలంలో నీళ్ళూ లేవు. ఇది కేవలం ఎన్నికల స్టంట్ తప్ప మరొకటి కాదు. ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల ప్రజల్ని మోసం చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది.
ప్రకాశం జిల్లా ప్రజల కలల పంటగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు గత 40 సంవత్సరాలుగా సాగుతూనే ఉన్నది. పదే పదే గడువులు పెట్టినా పూర్తి చేయని పాపం గత తెలుగుదేశం, ప్రస్తుత వైసిపి ప్రభుత్వాలదే. జగన్ ప్రభుత్వం 4 సంవత్సరాలుగా ప్రాజెక్టు పూర్తయిందని ఊరిస్తూనే వుంది. నిధులు ఇవ్వకపోవడం, పునరావాసం పూర్తిచేయకపోవడం వలన ఇది దీర్ఘకాలం పెండిరగులో ఉన్నది. జిల్లా ప్రజలు నిత్యం కరువువాత పడుతూనే ఉన్నారు. వలసలు పెరుగుతూనే ఉన్నాయి. ఎన్నికలప్పుడు మాయమాటలు చెప్పి పాలకులు తప్పించుకుంటున్నారు. ఇప్పటికైనా పూర్తిస్థాయి నిధులు కేటాయించి వచ్చే ఖరీఫ్ నాటికి ప్రజలకు నీళ్ళు అందుబాటులోకి తీసుకురావాలని, ఈలోగా పునరావాసం పూర్తి చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి