
(ప్రచురణార్థం : ఎన్నికల ప్రత్యేక పర్యవేక్షణాధికారి గారిని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జె.జయరాం కలిసి మెమోరాండం సమర్పించారు. ఆ కాపీని ప్రచురణార్థం విడుదల చేస్తున్నాము. ఇంటింటి ప్రచారానికి కూడా అనుమతుల తీసుకోవడం గురించి ఇబ్బందులు తెలియజేశారు. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 28 ఏప్రిల్ 2024.
శ్రీ రామ్ మోహన్ మిశ్రా గారు, ఐ.ఎ.ఎస్(రిటైర్డ్),
ఎన్నికల ప్రత్యేక పర్యవేక్షణాధికారి,
ఆంధ్రప్రదేశ్.
విషయం: అరకు పార్లమెంటు ఎన్నికల ప్రచార ఇతర అనుమతులు ఆయా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఇప్పించుట కొరకు ` విజ్ఞప్తి.
సార్..
2024 సార్వత్రిక ఎన్నికల్లో సిపిఐ(ఎం) పార్టీ ఎంపీ అభ్యర్ధిగా అరకు (ఎస్టీ) లోక్‌సభ నియోజకవర్గంలో పాచిపెంట అప్పలనర్స పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా లోకల్ మండలాల పరిధిల్లో ప్రచార వాహనాలు (జీపులు) అనుమతి కోసం అరకువేలి రిటర్నింగ్ అధికారి గారికి, పాడేరు నియోజకవర్గం పాడేరు రిటర్నింగ్ అధికారికి ప్రచార వాహనాల కోసం సువిధ పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా పర్మిషన్ కోసం ధరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఎంపీ అభ్యర్ధి ప్రచార పర్మిషన్లు పార్వతీపురంలోనే తీసుకోవాలని అరకువేలి రిటర్నింగ్ అధికారి చెప్పారు.
కావున అరకువేలి, పాడేరు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రచార వాహనాలు ఇతర అనుమతుల కోసం పార్వతీపురం వెళ్లి అనుమతి తీసుకోవాలంటే సాధ్యం కాని పరిస్థితి. గిరిజన ప్రాంతంలో అంతదూరం వెళ్లడం వ్యయ ప్రయాసలతో కూడిన సమస్య. కావున పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ అనుమతులు ఆయా అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారులు ఇచ్చేలా తగు ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నాము.
అభివందనములతో..
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి