
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 03 సెప్టెంబరు, 2024.
విరివిగా విరాళాలిచ్చి వరద బాధితులను ఆదుకోండి.
రాష్ట్రంలో భారీవర్షాల వలన 17 మంది చనిపోయారు. కృష్ణానది, బుడమేరుకు గత 2 దశాబ్దాలలో ఎన్నడూలేనంత వరద రావటం వలన లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. వందల ఇళ్లు కూలిపోయాయి. ఇంట్లో సామానులు, నిత్యావసరాలు పనికిరాకుండా పోయాయి. వీరందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఈ వరద సహాయ కార్యక్రమాల్లో సిపిఐ(యం) భాగస్వామిగా ఉంది. బాధితులకు వసతి, ఆహారం, నీరు అందించడానికి కార్యకర్తలు కృషి చేస్తున్నారు. ఈ సహాయం సరిపోదు. మరింత కావాలంటే రాష్ట్ర ప్రజానీకమంతా తోడ్పాటు అందించాల్సిన అవసరముంది. ఈ నేపధ్యంలో సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ విరాళాలకు పిలుపునిస్తున్నది. ఈ క్రింది బ్యాంకు అకౌంట్‌కు మీ సహాయం అందించాలని కోరుతున్నాము.
అకౌంట్ పేరు: సిపిఐ(యం) పీపుల్స్ రిలీఫ్ ఫండ్
అకౌంట్ నెంబరు: 62109192143
బ్యాంకు పేరు: స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఐఎఫ్‌ఎస్‌సి కోడ్:SBIN 0020343
బ్రాంచ్ పేరు : బీసెంట్ రోడ్ బ్రాంచ్, విజయవాడ.
విరాళం పంపిన తర్వాత సమాచారం 9490099018 కు వాట్సాప్‌కు లేదా [email protected] మెయిల్ పంపాల్సి ఉంటుంది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org