
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 05 సెప్టెంబరు, 2024.
సిపిఐ(యం) పార్టీ సీనియర్ నాయకులు, గొప్ప పోరాట యోధులు, పశ్చిమగోదావరి జిల్లా ప్రజల ప్రియతమ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ రైతు నాయకుడు అయిన రుద్రరాజు సత్యనారాయణ (ఆర్.ఎస్) (97) గారి మృతి పట్ల సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నది.
కామ్రేడ్ రుద్రరాజు సత్యనారాయణ తన యావత్ జీవితాన్ని సమాజసేవకే అంకితం చేశారు. పీడిత ప్రజల విముక్తి కోసం, శ్రామిక వర్గ రాజ్యం కోసం ఆహరహం కృషి చేశారు. ప్రజల కోసం ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి పోరాడారు. భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో 1977`78, 1978`80 మధ్య కాలంలో జైలుకెళ్లారు. 1967`72 మధ్య శాసనసభ్యునిగా ప్రజాసమస్యలపై అసెంబ్లీలో కృషి సల్పారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీని విస్తరింప చేయటంలోనూ, సమస్యలపై సమరశీలంగా నడిపించడంలోనూ, కార్యకర్తలకు మనోధైర్యం కల్పించి నిలబెట్టడంలోనూ దిట్ట. పశ్చిమగోదావరి జిల్లా రైతు ఉద్యమ నిర్మాణంలో ఆయన పాత్ర మరువలేనిది.
ఆయన మృతి పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరనిలోటు. ఆయనకు జోహార్లు ఆర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు రాష్ట్ర కమిటీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది.
బివి రాఘవులు సంతాపం
ఆర్‌ఎస్ మరణించారన్న వార్త నన్ను తీవ్రంగా బాధించిందని సిపిఐ(యం) పోలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘువులు తెలిపారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేయడంలో ఆయన కృషి అద్వితీయం. దాదాపు 8 దశాబ్దాల పాటు అనేక ఆటుపోట్లు, నిర్భందాన్ని ఎదుర్కొని పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజా ఉద్యమాలను, కమ్యూనిస్టు ఉద్యమాన్ని అభివృద్ధి చేసేందుకు చిట్టచివరి వరకు కృషి చేశారు. స్పూర్తివంతమైన ఆయన జీవితం యువతకు ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుందని ఆయన తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.
(జె.జయరాం)
ఆఫీసు కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org