
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 04 నవంబర్, 2024.
అధిక ధరలతో ఒక వైపు, ఆదాయాలు తరిగిపోయి మరో వైపు సతమతమవున్న ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 11 వేల కోట్ల రూపాయలు, గతంలో 6వేల కోట్ల రూపాయలు మొత్తం 17వేల కోట్ల రూపాయాలు ట్రూ అప్ ఛార్జీల భారం వేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. వెంటనే ఆ ప్రతిపాదనను ఉపసంహరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.
2023-24 సంవత్సరానికి ఖీూూజA చార్జీల పేరిట ట్రూ అప్ భారం ప్రతిపాదిస్తూ మూడు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కాములు) సోమవారం నాడు నోటిఫికేషన్లు ఇచ్చాయి. ఇటీవల వేసిన 6,072 కోట్ల ట్రూ అప్ భారం ఇంకా అమలులోకి రాక ముందే అంతకు రెట్టింపు భారాన్ని అదనంగా ప్రజలపై మోపడం దారుణం. మొత్తం కలిపి 17 వేల కోట్ల రూపాయల భారం మోపడం శోచనీయం. తాజా ప్రతిపాదనలో యూనిట్ విద్యుత్ కు గరిష్టంగా రెండున్నర రూపాయలు వడ్డిస్తున్నారు. నిరుపేద గృహస్తులు యూనిట్ కి చెల్లించే 1.90 పైసలకు ఇది 130 శాతం అధికం. డిస్కాముల ప్రకటనలో మొత్తం ఎంత భారం వేసారో, అది ఎందుకు అవసరం అయ్యిందో కనీసం ఒక్క వాక్యం కూడా ఇవ్వకపోవడం ప్రజలను మోసగించడమే. ఉన్న ప్రభుత్వ జెన్కో ప్లాంట్ల నుండి కరెంటు తీసుకోకుండా (బ్యాక్ డౌన్ చేసి) అధిక ధరలకు ఓపెన్ మార్కెట్ లో కొనుగోలు చేయడం ఇందుకు ముఖ్య కారణం. ప్రైవేట్ కంపెనీలకు అడ్డగోలుగా చెల్లింపులు చేయడం మరోకారణం. ప్రభుత్వాల తప్పుడు విధానాలు, అవినీతి, అక్రమాలకు ప్రజలను బలి చేయడం తగదు. ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు భారాలు మోయాలనడం అసంబద్ధం. మోసపూరితమైన ట్రూ అప్ విధానాన్ని రద్దు చేయాలని, మొత్తం 17 వేల కోట్ల రూపాయల ట్రూఅప్ భారాన్ని ఉపసంహరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org