కార్పొరేట్‌ గవర్నెన్స్‌ వద్దు ప్రభుత్వమే పౌర సేవల బాధ్యత తీసుకోవాలి - సిపిఐ(యం) డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 17 జనవరి, 2025.

కార్పొరేట్‌ గవర్నెన్స్‌ వద్దు
ప్రభుత్వమే పౌర సేవల బాధ్యత తీసుకోవాలి
- సిపిఐ(యం) డిమాండ్‌
డేటా రక్షణ చట్టం లేకుండా 150 రకాల పౌర సేవలను వాట్సాప్‌ ద్వారా అందించటం పౌరుల ప్రాథమిక హక్కులకు భంగకరం. రాష్ట్రంలో వాట్సాప్‌ ద్వారా ఈ-గవరెన్స్‌ సేవలు అందించేందుకు వాట్సాప్‌ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు దాన్ని 18 తేదీన ప్రారంభించబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఏదైనా ఒక సర్టిఫికేట్‌ కావాల్సివస్తే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేయాలి. వాట్సాప్‌లో అవి భద్రంగా ఉంటాయన్న చట్టబద్ధ గ్యారంటీ లేదు. వాటిని దుర్వినియోగం చేయరన్న చట్టబద్ధ హామీ లేదు. 2018 నుండి డేటా ప్రైవసీ చట్టం పెండిరగులోనే వుంది. అది చట్టం కాకుండా ఇలాంటి ఒప్పందాలు పౌరుల వ్యక్తిగత భద్రతకు ముప్పు. గతంలో ఆధార్‌ సహా అనేక రకాల డాక్యుమెంట్లు దుర్వినియోగం అయిన విషయం విదితమే. పౌర సేవలు వేగంగా అందుతాయో లేదో గ్యారంటీ లేదు కానీ రాజకీయ, వ్యాపార ప్రయోజనాలకు డేటా దుర్వినియోగం అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. ఇప్పటికే మీసేవ, సచివాలయ వ్యవస్థలు వున్నాయి. వాట్సాప్‌తో ఒప్పందం చేసుకొని సచివాలయం సిబ్బందిని తగ్గించాలన్న యోచనలో ప్రభుత్వం వుంది.  మీసేవ సిబ్బంది నిరుద్యోగులవుతారు.  గోప్యంగా ఉండాల్సిన పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని అంబానీ, మెటా (ఫేస్‌బుక్‌) వంటి కార్పొరేట్‌ కంపెనీల పరం చేయడం అభ్యంతరకరం. డేటా ప్రైవసీ రక్షణ చట్టం వచ్చేంత వరకు ఈ ఒప్పందాన్ని అమలు చేయొద్దని, సచివాలయం సిబ్బందిని కుదించరాదని, మీసేవా కేంద్రాలకు భద్రత కల్పించాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి

 

--

COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee

H.No. 27-30-9,

Akula vari Street,
Governorpet, 

Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org