
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 29 జనవరి, 2025.
భక్తులకు భద్రత కల్పించడంలో విఫలం
ప్రయాగరాజ్ ఘటనపై సిపిఐ(యం) దిగ్బ్రాంతి
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా తొక్కిసలాటలో 20 మంది మృతిచెందడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నది. ఈ ఘటనలో అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారి కుటుంబాలకు, గాయపడిన భక్తులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నది.
ఉత్తరప్రదేశ్ బిజెపి ప్రభుత్వం మౌని అమావాస్య సందర్భంగా భక్తులు రావాలని ప్రకటనలు ఇచ్చింది. ఆరోజు భక్తులు పెద్దఎత్తున వస్తారని తెలిసి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. భక్తుల మరణానికి కారకులైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌కు ఆ పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదు. ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళిన భక్తుల భద్రతకు మన రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి