ఢల్లీి ఘటనపై సిపిఐ(యం) దిగ్భ్రాంతి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 16 ఫిబ్రవరి, 2025.

 

ఢల్లీి ఘటనపై సిపిఐ(యం) దిగ్భ్రాంతి

భక్తులకు భద్రత కల్పించడంలో మోడీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం విఫలం

ఢల్లీి రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో కుంభమేళాకు వెళ్తున్న ప్రయాణీకులు 18 మంది మృతిచెందడం, అనేక మంది గాయపడడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నది. వరుసగా ప్రమాదాల్లో భక్తులు మరణించడం పట్ల  సిపిఐ(యం) ఆందోళన చెందుతున్నది. ప్రమాదాల్లో భక్తులు మరణిస్తున్నా ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం గర్హనీయం. మహా కుంభమేళాలో పాల్గొనమని ప్రజలను ప్రోత్సాహిస్తున్న ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను మాత్రం గాలికొదిలేశారు. ప్రమాద కారణాలను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు.

చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర కమిటీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. చనిపోయినవారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేస్తున్నది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం భక్తుల భద్రతకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి