క్రైస్తవ బోధకులు పనగల ప్రవీణ్‌ మృతిపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 25 మార్చి, 2025.

 

క్రైస్తవ బోధకులు పనగల ప్రవీణ్‌ మృతిపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. ఈరోజు రాజమండ్రిలో జరిగిన ఈ ఘటనపై ప్రజల్లో అనేక అనుమానాలున్నాయి. ఇతను క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నాడనే కారణంతో కొంతమంది దుండగులు ఆయన మృతికి కారణమయ్యారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జరిగిన కొన్ని ఘటనలు, తనను హత్య చేయొచ్చని ప్రవీణ్‌ వ్యక్తం చేసిన అనుమానం దీనికి బలమైన ఆధారాలు చూపుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ జరిపించాల్సిందిగా కోరుతున్నాము.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి