ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ పటిష్టంగా అమలుకు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 26 మార్చి, 2025.

 

ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ పటిష్టంగా అమలుకు చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌ నిర్వహించిన రాజకీయ పార్టీల సమావేశానికి సిపిఐ(యం) నుండి పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జె.జయరాం హాజరయ్యారు. ఈ క్రింది సూచనలు చేశారు.

(1) ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా వీలైనన్ని పోలింగ్‌ కేంద్రాలు పెట్టాలని కోరారు. కొండలు ఎక్కి చాలా దూరం ప్రయాణించి ఓటు వేయాల్సి వస్తున్నది. అవసరమైన రవాణా, తిండి సదుపాయాలు కల్పించాలి.

(2) ఒకే ఇంట్లో ఉండే వారందరికీ ఒకే పోలింగ్‌ బూత్‌ ఉండేట్లు చర్యలు తీసుకోవాలి.

(3) ఓటింగ్‌ యంత్రాలు వివిపిఎటి లను 50% ఖచ్చితంగా ఉండేట్లు చర్యలు తీసుకోవాలని అప్పుడే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌పై  ప్రజలకు నమ్మకం కలుగుతుందని తెలిపారు.

(4) ఎన్నికల్లో ధన ప్రభావాన్ని అడ్డుకునేందుకు పోలింగ్‌కి మూడు రోజుల మందు యుపిఐ చెల్లింపులపై నిఘా పెట్టాలని తెలిపారు.

(5) ఎన్నికల సమయంలో సోషల్‌ మీడియాలో పార్టీలు, అభ్యర్థులు, నాయకులపై అసత్యాలతో కూడిన దుష్ప్రచారం జరుగుతోందని దీనికి అడ్డుకట్ట వేయాలని తెలిపారు.

(6) ఎన్నికల మెటీరియల్‌ పంపడానికి ప్రభుత్వ, ప్రయివేటు పార్శిల్‌ సర్వీసుల్లో అనుమతించడం లేదని, దీనివలన చిన్న పార్టీల ప్రచారానికి ఆటంకం కలుగుతోంది. కాబట్టి అన్ని పార్శిల్‌ సర్వీసుల్లో అనుమతించాలని కోరారు.

(7) ఓటును ఆధార్‌ కార్డుకు లింక్‌ చేయడం సరైంది కాదని, ఈ అంశం సుప్రీం కోర్టులో ఉందని తెలిపారు.

(8) పోలింగ్‌ 48 గంటల ముందు ప్రచారం నిలుపుదల చేయాలని నిబంధనలు పేర్కొంటున్నా పోలింగ్‌ రోజున పత్రికలలో, సోషల్‌ మీడియాలో, ఎలక్ట్రానిక్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రకటనలు తదితర రూపాలలో ప్రచారం జరుగుతున్నది. దీనిని  నిలిపివేయాలని కోరారు.

 

(జె.జయరాం)

ఆఫీసు కార్యదర్శి