‘తల్లికి వందనం’ చిరుద్యోగులకు కూడా వర్తింపచేయాలని కోరుతూ..

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశం ఈరోజు, రేపు (16,17 జూన్‌) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎ.వి.నాగేశ్వరరావు అధ్యక్షతన విజయవాడలో జరుగుతుంది. ఈ సమావేశంలో ఈ అంశంపై ముఖ్యమంత్రికి  లేఖ రాయాలని సమావేశం తీర్మానించింది. ఆ తీర్మానం ప్రకారం  ముఖ్యమంత్రికి పంపిన లేఖను ప్రచురణార్థం విడుదల చేస్తున్నాము. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 16 జూన్‌, 2025.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
అమరావతి.
            విషయం: ‘తల్లికి వందనం’ చిరుద్యోగులకు కూడా వర్తింపచేయాలని కోరుతూ...
అయ్యా!
    రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు నెలకు రూ.25,000లలోపు ఆదాయం ఉండే వారందరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించారు. అయితే మీ నాయకత్వంలో కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా తల్లికి వందనం అమలు చేస్తున్నామని ప్రకటించారు. అనేకమంది తల్లులకు అక్కౌంట్స్‌లో రూ.13,000లు చొప్పున వేశారు. ఈ జివోలో పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తామని చెప్పినప్పటికీ ట్రాక్‌ ఓపెన్‌ కావడం లేదని నిరాకరిస్తున్నారు. అతి తక్కువ ఆదాయాలు వస్తున్న కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు, స్కీమ్‌ వర్కర్లకు, మున్సిపల్‌ కార్మికులకు తదితర ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరుతో వారికి అమలు చేయలేదు.  కేవలం సిఎఫ్‌ఎమ్‌ఎస్‌లు వేతనాలు తీసుకున్నంత మాత్రాన ప్రభుత్వ ఉద్యోగులు కాదు. వీరిలో అనేకమందికి రూ.10వేలు అంతకన్నా తక్కువ వేతనం వచ్చేవారే.
    కాంట్రాక్టు అండ్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు రూ.25,000లు ఆదాయాలు వస్తున్నాయి. అంగన్‌వాడీలకు, వర్కరు రూ.11,500లు, హెల్పరు రూ.7,000లు, ఆశాలకు రూ.10,000లు మాత్రమే ఇస్తున్నారు. కావున ప్రభుత్వ ఉద్యోగులు అనే విధానాన్ని తొలగించి గ్రామాలలో రూ.20,000లు, పట్టణాలలో నెలకు రూ.25,000ల లోపు ఆదాయం వచ్చే వారందరికీ తల్లికి వందనం అమలు చేయాలని కోరుతున్నాను. జివోలో పేర్కొన్న విధంగా పారిశుద్ద్య కార్మికులకు వెంటనే తల్లికి వందనం నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
అభివందనములతో...

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి

-- 
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee
H.No. 27-30-9,Akula vari Street,
Governorpet, Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org