గోదావరి నీటిమట్టం పెరుగుతున్నందున పోలవరం లో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 08 జూలై, 2025.

 

గోదావరి నీటిమట్టం పెరుగుతున్నందున

పోలవరం లో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలి

గోదావరి వరద పెరుగుతోందని భారత వాతావరణం శాఖ (ఐఎండి) ముందస్తు సూచనలకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్వాసితులకు రక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

కూనవరం, చింతూరు మండలాల్లో ప్రజలను జాగృతం చేసి వరదకు గురవుతున్న గ్రామాలను  తక్షణమే వరద సహాయక శిబిరాలకు ప్రభుత్వమే వెహికల్స్‌ పెట్టి తరలించాలి. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్ళలో వరద సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలి. వారికి బోజన, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. వరద వచ్చిన తరువాత తరలించడం వలన ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం వరదరాక ముందే సహాయక చర్యలు చేపట్టాలని సిపిఐ(యం) కోరుతున్నది. ప్రభుత్వ కార్యాలయాలు లేనిచోట ప్రభుత్వమే టార్పాలిన్స్‌ పంపిణీ చేసి ఎత్తైన ప్రదేశాలకు పంపాలి.  బియ్యం, కందిపప్పు, మంచి నూనె, కిరోసిన్‌, ఉల్లిపాయలు, పంచదార, గోధుమపిండి  తదితర నిత్యవసరాలు పంపిణీ చేసి వారిని ఆదుకోవాలని కోరుతున్నది.

పోలవరానికి కేటాయించిన నిధులలో పోలవరం నిర్వాసితులకు పరిహారాన్ని మొదట ప్రాధాన్యతగా ఇచ్చి, ప్రతి సంవత్సరం వచ్చే వరదల బారిన పడకుండా శాశ్వత పరిష్కారం చూపాలని సిపిఐ(యం) కోరుతున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి