రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికుల డిమాండ్‌లను పరిష్కరించి సమ్మె విరమింప చేయాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 15 జూలై, 2025.
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికుల
డిమాండ్‌లను పరిష్కరించి సమ్మె విరమింప చేయాలి
- సిపిఐ(యం)
జీతాల పెంపు, సంక్షేమ పథకాల అమలు తదితర డిమాండ్ల పరిష్కారం కోసం గత మూడు రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికులకు సిపిఐ(యం) రాష్ట్రకమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. గత ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే 25వేల రూపాయల లోపు జీతం ఉన్న వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలని, ఇంజనీరింగ్‌ కార్మికులు కోరుతున్న విధంగా జీవో నెంబర్‌ 36 ప్రకారం జీతాలు పెంచి, చెల్లించాలని సిపిఐ(యం) కోరుతున్నది.
ఇంజనీరింగ్‌ కార్మికుల  నైపుణ్యానికి అనుగుణంగా జీతాలు చెల్లించకపోవడంతో ఇంజనీరింగ్‌ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. నిత్యవసర సరుకుల ధరలు, కరెంటు చార్జీలు తదితర భారాలు మోయలేక కుటుంబాలు అర్థాకలితో గడుపుతున్నాయి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తల్లికి వందనం పథకం అమలుకోసం జారీ చేసిన 26 నెంబర్‌  జీవోలో ఆదాయ పరిమితిని 25 వేలకు పెంచకుండా  ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకుండా పారిశుధ్య కార్మికులను, చిరుద్యోగులందర్నీ మోసం చేశారు. గత సంవత్సరం మున్సిపల్‌ కార్మికులు నిర్వహించిన 17 రోజుల పోరాటం సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో మునిసిపల్‌ కార్మికులందరూ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగానే ఇంజనీరింగ్‌ కార్మికులు సమ్మె బాట పట్టాల్సి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దపెట్టి మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి

 

--

COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee

H.No. 27-30-9,

Akula vari Street,
Governorpet, 

Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org