
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 27 జూలై, 2025.
కరేడులో పోలీసు నిర్బంధాన్ని ఆపాలి
అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలి
- సిపిఎం డిమాండ్
ఇండోస్సోల్ కంపెనీకి బలవంతంగా రైతుల భూములను ధారాదత్తం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తున్న రైతులు, వ్యవసాయ కార్మికులు, గిరిజనులు, దళితులపై పోలీసు నిర్బంధాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. తక్షణం 30(ఎ) యాక్ట్‌ను ఉపసంహరించుకొని అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని కోరుతున్నది.
ఇప్పటికే ఒకసారి ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ప్రజలు ఏకగ్రీవంగా తిరస్కరించారు. అయినా దొడ్డిదారిన తిరిగి ఆ ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేసేందుకు తెరవెనక కుట్రలు సాగుతున్నాయి. అందులో భాగంగానే ఎవరికి తెలియకుండా మరో ప్రజాభిప్రాయ సేకరణ చేసే ప్రయత్నాన్ని ప్రజలు వమ్ము చేశారు. దీన్ని సహించలేని ఏంఎల్‌ఏ, కంపెనీ ప్రతినిధులతో కలసి ప్రజల మధ్య ప్రలోభాలు, తగాదాలు పెట్టి చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కరేడు గ్రామపంచాయతీ పరిధిలోని రామకృష్ణాపురంలో జరిగిన మహిళల మధ్య చిన్న వివాదాన్ని ఆసరా చేసుకొని గ్రామ మహిళా నాయకులపై దుర్మార్గంగా హత్యా ప్రయత్నం కేసు పెట్టి రిమాండ్ కు పంపారు. నిన్న ప్రజలందరూ ఐక్యమై ధర్నా చేయటంతో సెక్షన్ మారుస్తామని హామీ ఇచ్చారు. ఆ ఘటన ముగిసినప్పటికీ ఈరోజు తెల్లవారుజామున సిపిఎం మండల నాయకులు కుమార్ తో సహా కొంతమంది ఉద్యమ నాయకులను అరెస్టు చేశారు. ఈరోజు గ్రామంలో 30ఏ పోలీసు యాక్ట్ పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ మైక్ ప్రచారం చేస్తున్నారు. సభలు, సమావేశాలు నిషేధించారు. బయట నుండి రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు ఆ ప్రాంతాన్ని సందర్శించకుండా కట్టడి చేస్తున్నారు. ఈ నిర్బంధ చర్యలను సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది.
ఈ ఆప్రజాస్వామిక పద్ధతులకు స్వస్తి చెప్పి గ్రామ ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని తక్షణం ఇండోస్సోల్ కంపెనీ ఇవ్వదలచిన భూముల అక్రమ కేటాయింపులను రద్దు చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
