బాపట్ల జిల్లా క్వారీ ప్రమాదంపై న్యాయ విచారణ జరపాలని - సిపిఐ(యం) డిమాండ్‌ మృతులకు సంతాపం...

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 03 ఆగష్టు, 2025.

 

బాపట్ల జిల్లా క్వారీ ప్రమాదంపై న్యాయ విచారణ జరపాలని - సిపిఐ(యం) డిమాండ్‌

మృతులకు సంతాపం

బాపట్ల జిల్లాలో బల్లికురవ సమీపంలో సత్యకృష్ణ గ్రానైట్‌ క్వారీలో ఈ రోజు బండరాళ్ళు పడి ఏడుగురు మరణించడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నది. చనిపోయినవారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, గాయపడినవారికి సరైన వైద్యం, పది లక్షల సహాయం అందించాలని, క్వారీలో సరైన భద్రతా చర్యలు చేపట్టని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నది.

ఈ క్వారీ నిర్వహణకు ప్రభుత్వం అనుమతి లేదన్న వార్తలు మరింత ఆందోళన కల్పిస్తున్నాయి. క్వారీ యాజమాన్యం సరైన భద్రతా చర్యలు చేపట్టనందువల్లనే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అధికారులు అంచనాకు వచ్చినందున వెంటనే కారకులైన వారిని అరెస్టు చేయాలి. ప్రమాదానికిగల కారణాలపై న్యాయ విచారణకు ఆదేశించాలని సిపిఐ(యం) కోరుతున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి