
ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 04 ఆగష్టు, 2025.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ శ్రీకాకుళం (ఎచ్చెర్ల) ఐఎంఎల్ డిపోను విడదీసి టెక్కలిలో కొత్త ప్రైవేటు డిపో ఏర్పాటుకు ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ...
అయ్యా!
గత నెల 30న నేను శ్రీకాకుళం జిల్లా సందర్శించిన సందర్భంగా బేవరేజెస్ కార్పొరేషన్ కార్మికులు కలిసి వారి సమస్యను నా దృష్టికి తెచ్చారు. వాటిని పరిశీలించి న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఎచ్చెర్ల గ్రామంలో 1986లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం యారక్ బాటిలింగ్ యూనిట్ ఏర్పాటు సందర్భంగా ఎచ్చెర్ల గ్రామంలో 100 మంది దళిత కుటుంబాలకు చెందిన వారి నుంచి జాతీయ రహదారి ప్రక్కన కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా 1986లో తీసుకొని ఎచ్చెర్లలో యారక్ బాటిలింగ్ యూనిట్ ఏర్పాటు చేసింది. అందులో దళిత కుటుంబాల వారికి కార్మికులుగా, హమాలీలుగా ఉపాధి కల్పించారు. అప్పటి నుంచి ఇప్పుడు ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్, ఐయంఎల్ డిపోగా నడుస్తున్న దీనిలో 80మంది హమాలీలుగా లోడిరగ్, అన్‌లోడిరగ్ పనులు పనిచేస్తూ రోజువారీ వచ్చే ఆదాయంపైనే 350 కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి.
ఎచ్చెర్లలో ప్రభుత్వ సొంత గోడౌన్ ద్వారా మద్యం సరఫరా చేస్తుంటే అదనంగా టెక్కలిలో మరో డిపో ప్రైవేట్ గోడౌన్ అద్దెకు తీసుకొని ప్రారంభించేందుకు తేది: 08.07.2025న APSBCL/1/MMy/2025-26/3692ను జారీ చేసింది. దీనివలన గోడౌన్ కు ప్రభుత్వం ప్రతీనెల అద్దె చెల్లించాలని, అదనపు సిబ్బందిని నియమించాలని లక్షలాదిరూపాయలు ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది. మరో వైపున ఎచ్చెర్ల డిపో పైనే ఆధారపడిన 80 దళిత, పేద కుటుంబాలకు చెందిన హమాలీలకు తగినంత ఆదాయం లేక కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ విషయంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారికి, ఇతర అధికారులకు యూనియన్ తరపున వినతిపత్రాలు ఇచ్చి సమస్యను వివరించడం జరిగింది.
ఐఎంఎల్ డిపోను విడదీయొద్దని, కార్మికుల ఉపాధిని కాపాడాలని కోరుతూ వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు వెంటనే జోక్యం చేసుకొని ఎచ్చెర్ల ఐయంఎల్ డిపోను విడదీసి టెక్కలి మండలంలో అదనంగా మరో మద్యం డిపో ఏర్పాటుకు ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని, ఎచ్చెర్ల డిపోను యధావిధిగా కొనసాగించి దళితులు, పేదలుగా ఉన్న హమాలీల ఉపాధిని కాపాడాలని, రాష్ట్ర ప్రభుత్వం భూములు కోల్పోయిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org
