జమ్మూ కాశ్మీర్‌లో పుస్తకాల నిషేధాన్ని వ్యతిరేకించండి..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 07 ఆగష్టు, 2025.

జమ్మూ కాశ్మీర్‌లో పుస్తకాల నిషేధాన్ని వ్యతిరేకించండి
        జమ్మూ కాశ్మీర్‌లో 25 పుస్తకాలను నిషేధించాలనే లెఫ్టినెంట్‌ గవర్నర్‌
నిర్ణయాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటి
తీవ్రంగా ఖండిస్తోంది. ఈచర్య భావ ప్రకటన స్వేచ్ఛను నాశనంచేసే అధికార
నిరంకుశత్వానికి నిదర్శనం. అంతేకాదు భారత రాజ్యాంగం కల్పించిన మౌలిక
హక్కులపై బహిరంగ దాడి. ఇలాంటి చర్యలు ఉగ్రవాదులకు మాత్రమే మేలు చేస్తాయి.
        బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌
పనిచేస్తూ, ప్రజల, రచయితల, మేధావుల హక్కులను దారుణంగా హరిస్తున్నారు.
‘విచ్ఛిన్నవాదం మరియు ఉగ్రవాదానికి మద్దతు’ అనే పేరుతో కాశ్మీర్‌ చరిత్రను
మరియు ప్రస్తుత సమస్యల తీరును విశ్లేషించే 25 పుస్తకాలపై నిషేధం విధించారు.
వీటిలో ఏ.జి. నూరాని, అనురాధ భాసిన్‌, అరుంధతీరాయ్‌ లాంటి ప్రముఖ రచయితల
రచనలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి రచయితల అభిప్రాయాల పట్ల
భిన్నాభిప్రాయం ఉంటే ప్రజలకు వాస్తవాలు లేదా తమ అభిప్రాయాలు వివరించవచ్చు.
కానీ భావాలను ప్రజల్లోకి పోకుండా ఆటంకపరచడం ఆప్రజాస్వామ్యం.
        ఈ నిషేధాన్ని తక్షణమే ఉపసంహరించాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తోంది. జమ్మూ
కాశ్మీర్‌కు రాష్ట్ర స్థాయిహోదా పునరుద్దరించాలి. ప్రజలెన్నుకున్న
ప్రభుత్వం పూర్తి పరిపాలనాధికారంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి చర్యల
ద్వారా మాత్రమే జమ్మూ కాశ్మీర్‌ ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందడం
సాధ్యపడుతుంది. తద్వారా జాతీయ ఐక్యత బలపడుతుంది. ఉగ్రవాదుల, దేశ
విచ్చిన్నకుల కుట్రలను తిప్పి కొట్టవచ్చు.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి

--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee
H.No. 27-30-9,Akula vari Street,
Governorpet, Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org